![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -378 లో... కృష్ణ, మురారి ఇద్దరు పై నుండి కిందకి వస్తుంటే నందు వాళ్ళని చూసి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావని కృష్ణ అడుగుతుంది. ఇందాక నీ గురించి మధు ఒకటి అన్నాడు. అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నానని నందు చెప్తుంది. ఏమన్నావని మధుని కృష్ణ అడుగుతుంది. ఈ ప్రపంచంలో కృష్ణ లాగా ఎవరు ఉండలేరని అన్నానని మధు చెప్తాడు.
అవును ఈ తింగరిలాగా ఎవరు ఉండలేరు.. ఉండరని మురారి కూడా అంటాడు. నేను కూడా సీరియస్ గా ఉంటానని కృష్ణ అంటుంది. కాసేపు నువ్వు భవాని పెద్దమ్మలాగా ఉండని అనగానే ఉంటానని కృష్ణ సీరియస్ ఫేస్ పెట్టి కూర్చొని ఉంటుంది. అప్పుడే భవాని వచ్చి.. కృష్ణ కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. అయిన తను సీరియస్ గా ఉంటుంది. ఏంటి అలా ఉన్నావని కృష్ణని అడిగినా సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది కృష్ణని ఎవరైనా ఏమైనా అన్నారా అని భవాని అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మ కృష్ణ మీలాగా సీరియస్ గా ఉంటానని ఛాలెంజ్ చేసిందని మురారి చెప్పగానే.. అంటే నేను అలా ఉంటానా.. ఒకరిలాగా ఉండడం ఎందుకు. నువ్వు నీలా ఉండు.. నువ్వు ఎప్పటికి తింగరివే కానీ. వెళ్లి కాఫీ తీసుకొని రా అని కృష్ణకి భవాని చెప్తుంది. ఆ తర్వాత పంతులు గారు వచ్చి ముహూర్తం పది రోజుల వరకు బాలేదని చెప్తాడు. పది రోజులు టైమ్ ఉంది. ఈ లోపు ఏదైనా ప్లాన్ చెయ్యొచ్చని ముకుంద అనుకుంటుంది. దానిదేముంది ఇన్ని రోజులు ఆగాం.. పది రోజులు ఆగలేమా అని భవాని అంటుంది. ఆ తర్వాత పంతులికి మధు డబ్బులు ఇచ్చి పంపిస్తుంటే ముహూర్తాలు ఉన్నాయి కదా.. భవాని గారు ఎందుకు ఇలా చెప్పమన్నారని పంతులు అనుకుంటాడు.
ఆ తర్వాత ఆదర్శ్ గురించి ముకుంద ఆలోచిస్తుంటే.. ఆదర్శ్ వెనకాల నుండి వచ్చి ముకుందపై చెయ్యి వేస్తాడు. దాంతో ముకుంద భయపడి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి అందరు బయటకు వచ్చి.. ఏమైందని అడుగుతారు. ఇప్పుడు నాపై చెయ్యి వేస్తే అరిసానని చెప్తే ఆదర్శ్ అంటే ఇష్టం లేదా అని అత్తయ్య కన్ఫమ్ అయిపోతుందని ముకుంద అలోచించి.. మేమ్ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే పై నుండి తొండ పడిందని ముకుంద అందరికి చెప్తుంది. అందరు వెళ్ళిపోయాక సారీ అలా చెప్పినందకని ఆదర్శ్ కి ముకుంద సారీ చెప్తుంది. అలా చెప్పి మంచి పని చేసావని ఆదర్శ్ అంటాడు. నీకు ఎలా చెప్పాలి నా ప్రేమ మురారికి తప్ప ఎవరికీ లేదని.. నేను అందరిని మోసం చేస్తున్నానని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో ఆదర్శ్, ప్రసాద్ మురారి, మధు కలిసి డ్రింక్ చేస్తుంటారు. అసలు తొండపడితే ముకుంద అంత గట్టిగా అరుస్తుందా అని మధు అనగానే.. ఎక్కడ ఆదర్శ్ చెప్పేస్తాడేమోనని కృష్ణ దగ్గరకి ముకుంద వెళ్లి అందరు డ్రింక్ చేస్తున్నారని చెప్పి.. వాళ్ళ దగ్గరకి కృష్ణని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |